వైయస్ బంధువు కావడం వల్లే: బాబు
విశాఖపట్నం: తాండవ నదిపై ఆనకట్ట నిర్మాణంలో నాణ్యత లోపించినప్పటికీ కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి బంధువు కావడం వల్ల చర్యలు తీసుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తాండవ నిర్వాసితులను ఆయన గురువారం పరామర్శించారు. తాండవ ఆనకట్ట నిర్మాణంలో నాణ్యతాలోపంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలు, రైతుల అంశాలే తమ ఎజెండా చంద్రబాబు విశాఖపట్నం ఏరువాకలో ప్రకటించారు. ప్రభుత్వానికి రైతుల పరిస్థితి పట్టడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. రైతు సమస్యలపై యుఎన్ పిఎ పార్లమెంటును స్తంభింపజేస్తుందని ఆయన చెప్పారు. పాయకరావుపేటలోని విద్యార్థుల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఒక పూరిగుడిసెలోకి వెళ్లి వారి పరిస్థితి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications