తిరుమల పుష్కరిణిలో తేలిన శవం
తిరుమల: తిరుమల పుష్కరిణిలో ఒక భక్తుడు మునిగి చనిపోయాడు. గురువారం ఉదయం పుష్కరిణిలో తేలిన శవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పుష్కరిణి సిబ్బంది వెలికి తీశారు. అతడు పుష్కరిణిలో పడి ఎలా మరణించాడనే విషయం తెలియడం లేదు. అతనికి సంబంధించిన బంధువులు కూడా ఎవరూ రాలేదు. ఫిర్యాదు అందని కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదు. టిటిడి నుంచి ఫిర్యాదు అందితే కేసు నమోదు చేయాలని పోలీసులు అనుకుంటున్నారు.
మృతుడి వద్ద లభించిన ఎటియం, బ్యాంకు అకౌంట్ వివరాలను బట్టి అతడిని సత్యప్రకాశ్ గా గుర్తించారు. అతనికి దాదాపు 45 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. అతను కాకినాడకు చెందినవాడని భావిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం కూడా తెలియడం లేదు.












Click it and Unblock the Notifications