పోతనపై క్షమాణకు కెసిఆర్ డిమాండ్
హైదరాబాద్: కడప ద్విదశాబ్ది ఉత్సవాల్లో మహాకవి బమ్మెర పోతనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విమర్శించారు. అందుకు జిల్లా కలెక్టర్, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. భాగవతాన్ని ఆంధ్రీకరించిన బమ్మెర పోతన వరంగల్ జిల్లాలోని బమ్మెరకు చెందినవాడని సాహిత్య చరిత్రకారులు అంగీకరించి చరిత్రలో రికార్డు చేసిన తర్వాత కూడా అతను కడప జిల్లాలోని ఒంటిమిట్టకు చెందినవాడని కడప జిల్లా ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రదర్శించుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
బమ్మెర పోతన కడప జిల్లాకు చెందినవాడని చెప్పుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో గురువారంనాడు హైదరాబాదులోని ట్యాంకుబండ్ మీద గల పోతన విగ్రహం వద్ద రచయితలు, కవులు, మేధావులు ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డితో పాటు జయశంకర్, టంకశాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. భాగవత కర్త పోతన వరంగల్లు జిల్లావాడని నిర్ధారణ అయిన తర్వాత కూడా వివాదం సృష్టించడాన్ని సి. నారాయణ రెడ్డి తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications