కర్ణాటక వాహనంలో దుండగుల పరారీ
చిత్తూరు: మాజీ శాసనసభ్యుడు సి.కె. బాంబుపై దాడికి బాంబులు పేల్చిన దుండగులు కర్ణాటక వాహనంలో పారిపోయినట్లు సమాచారం. దాడి చేసినవారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే సి.కె. బాబుపై దాడి జరిగింది. స్వల్ప గాయాలతో ప్రాణాపాయంతో బయట పడిన ఆయన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆరా తీశారు.
కల్వర్టు కింద బాంబులు అమర్చి దుండగులు పేల్చారు. దాంతో సి.కె. బాబు ప్రయాణిస్తున్న క్వాలిస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో సి.కె. బాబు అంగరక్షకుల్లో సూర్యనారాయణ అనే అతను మరణించగా మరో అంగరక్షకుడు, అనుచరుడు, డ్రైవర్ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వేలూరు ఆస్పత్రిలో చేర్చారు. వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. కల్వర్టు కింద పోలీసులు పేలని రెండు బాంబు కనుక్కున్నారు. ఈ సాయంత్రానికి గాని బాంబులు అమర్చిన తీరుపై, నిందితులపై ఒక అంచనాకు రాలేమని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications