చితి నుంచి శవాన్ని తీసిన పోలీసులు
విజయవాడ: కాలుతున్న చితి నుంచి శవాన్ని తీసి పోలీసులు దాన్ని పోస్టుమార్టంకు తరలించిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కృష్ణా జిల్లా పెనగంచిప్రోలు మండలం పొనగంచి గ్రామంలో నర్సింహారావు, పద్మావతి దంపతులు ఆస్తి తగాదాల కారణంగా నాలుగేళ్ల క్రితం విడిపోయారు. అయితే నర్సింహారావు అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
నర్సింహారావును చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులను అడ్డుకుని బంధువులు నర్సింహారావు శవాన్ని హడావిడిగా స్మశానానికి తరలించి దహన క్రియలు ప్రారంభించారు. కూతురు శవానికి నిప్పంటించింది. పోలీసులు స్మశానానికి వెళ్లి కాలుతున్న శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. విషయం తెలిసిన బంధువులు ఎక్కడికక్కడ పారిపోయారు.












Click it and Unblock the Notifications