పోలవరం: అప్పిలేట్ అథారిటీ తీర్పు సస్పెన్షన్
హైదరాబాద్: గోదావరి నదిపై ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని రద్దు చేస్తూ అప్పిలేట్ అథారిటీ తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. విచారణను ఫిబ్రవరి 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
అప్పిలేట్ అథారిటీ తీర్పును హైకోర్టు సస్పెండ్ చేయడం ప్రభుత్వాన్ని సమర్థించడం కాదని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. హైకోర్టు సస్పెన్షనును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్లాలని ఆయన పర్యారణవేత్తలకు, గిరిజన సంఘాలకు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సిపియం ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications