వైయస్ క్షమాపణ లేఖ రాయాలి: టిడిపి
హైదరాబాద్: వచ్చే 2008 సంవత్సరాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఉపాధి నామ సంవత్సరంగా ప్రకటించడాన్ని తెలుగుదేశం నాయకులు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు తప్పు పట్టారు. యువతకు క్షమాపణ చెబుతూ వైయస్ మరో లేఖ రాయాలని వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ ఏడాదిని రైతు నామ సంవత్సరంగా ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇప్పుడు ఉపాధి నామ సంవత్సరమని అంటున్నారని, ఒక్కే సంవత్సరాన్ని రెండు పేర్లతో పిలువడం సరి కాదని, ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని వారన్నారు.
గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే ఇప్పటి వరకు అమలు పరచలేదని, ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కొత్త హామీలు ఇస్తున్నారని వారన్నారు. రైతు నామ సంవత్సరంలో సాగు విస్తీర్ణం పెరగలేదని, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవని వారన్నారు. యువతకు లక్ష ఉద్యోవకాశాలు కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications