ఎన్టీఆర్ గార్డెన్ చెత్తకుండీలో దొరికిన బాంబు
హైదరాబాద్:ఎన్టీఆర్ గార్డెన్ ప్రాంతంలో బుధవారం బాంబు కలకలం రేగింది. అక్కడి ఉన్న చెత్తకుండీలో బాంబు ఉన్నట్టు గమనించిన కొందరు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు వచ్చి దానిని నిర్వీర్యం చేశారు. బాంబు దొరికిందని, అది నాటు బాంబని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు బాంబు పేలిన లుంబినీ పార్కు సమీపంలోనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ ప్రాంతంలో బాంబు దొరకడంతో ఆ ప్రాంతానికి వచ్చిన సందర్శకులు కలవరపాటుకు గురయ్యారు. ఇంకో విశేషం ఏమంటే బాంబు పేలడంతో ఇన్నాళ్లు మూసివేసి ఉన్న లేజర్ షో జనవరి ఒకటిన ప్రారంభం అయింది. అది ప్రారంభం అయిన మరునాడే ఆ ప్రాంతంలోనే మరో బాంబు దొరకడం గమనార్హం.












Click it and Unblock the Notifications