బీఎప్సీలో చేరడానికి నరేంద్ర నిర్ణయం
హైదరాబాద్:తెలంగాణా రాష్ట్ర సమితి(తెరాస)తరపున ఎంపీగా ఎన్నికయిన సీనియర్ నాయకుడు నరేంద్ర బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరతానని బుధవారం ప్రకటించారు. తెరాస నుంచి తొలగించబడిన నరేంద్ర ఆ తరువాత తెరాస(ఎన్)తో కొనసాగుతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి పాల్గొంటున్న జనవరి 6న జరిగే బహిరంగ సభ సందర్భంగా నరేంద్ర బీఎస్పీలో చేరవచ్చు. బీఎస్పీలో చేరతానని బుధవారం ప్రకటించిన నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ బీఎస్పీతోనే ప్రత్యేక తెలంగాణా సాధ్యమవుతుందని, అందుకే బీఎస్పీలో చేరడానికి నిర్ణయించుకున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications