చిరుకు అడ్డు ఎస్సార్సీ ఊసు: మధు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడానికే రెండో ఎస్సార్సీని తెరపైకి తెచ్చారని సిపియం పార్లమెంటు సభ్యుడు పి. మధు వ్యాఖ్యానించారు. చిరంజీవి తమతో చర్చలు జరిపారని చెప్పిన మధు బుధవారం ఈ సంచలన ప్రకటన చేశారు. దీన్ని బట్టి వామపక్షాలు చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని ఆహ్వానిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణపై రెండో ఎస్సార్సీని అంగీకరించేది లేదని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విశాఖపట్నంలో అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ రెండో ఎస్సార్సీని తెరపైకి తెచ్చి ఆభాసు పాలైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కరీంనగరులో అన్నారు. రెండో ఎస్సార్సీ వల్ల తమ పార్టీకి నష్టం ఉండదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు.












Click it and Unblock the Notifications