రెండో ఎస్సార్సీయే: గాదె వెంకటరెడ్డి
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ విషయంలో తాము రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి అన్నారు. తమ పార్టీ విధానం రెండో ఎస్సార్సీయేనని ఆయన అన్నారు. ఆ విధానంలో ఇంకా మార్పు చేయలేదని, అందువల్ల రెండో ఎస్సార్సీయే తమ విధానమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ విషయంలో ఆ ప్రాంతనాయకులు మాట్లాడుతున్న విషయాలపై ఆయన ప్రతిస్పందిస్తూ వారి అభిప్రాయాలు వారివని అన్నారు. తాను రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని ఆయన లేక్ వ్యూ అతిథిగృహంలో కలిశారు.












Click it and Unblock the Notifications