ఎన్నారైల కోసం సమాచార కేంద్రం: ప్రధాని

ప్రవాస భారతీయులు విదేశాల్లో సాధిస్తున్న విజయాలకు గర్వపడుతున్నామని ప్రధాని ప్రశంసించారు. మన భిన్నత్వంలో ఏకత్వం విధాన స్ఫూర్తితో ప్రవాస భారతీయులు ప్రపంచ దేశాలకు కలసి నివసించడంలో కొత్తదోవ చూపించాలని ఆయన ఆకాంక్షించారు. స్వదేశానికి ప్రవాస భారతీయులు చేస్తున్న సేవలను ప్రధాని ప్రశంసించారు.
మాతృదేశ అభివృద్ధికి కృషి చేయాలనుకునే వారి సేవలు అందుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఇలాంటి వారి కోసం భారత అభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. సుమారు 45 దేశాలకు చెందిన 1500 మంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications