హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని త్వరలో నియమిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ బుధవారం ఉదయం హైదరాబాద్ లో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయం పరిశీలించడానికి రెండో ఎస్సార్సీ నియమించే విషయంలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం సీరియస్ గా ఉందని ఆయన చెప్పారు. వీరప్ప మొయిలీతో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ కు సంబంధించిన అనేక విషయాలపై వారు చర్చించుకున్నట్టు సమాచారం. హీరో చిరంజీవి రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైన నేపధ్యంలో చిరంజీవి మీద కూడా వీరు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.