సోనియా చెవిన తప్పులు: ఎమ్మెస్సార్

తెలంగాణపై కాంగ్రెస్ రెండో ఎస్సార్సీ వేస్తారనేది ఊహాగానమేనని ఆయన అన్నారు. ఆ విషయాన్ని ప్రధాని కార్యాలయం ఖండించిందని, వీరప్ప మొయిలీ ఏమన్నారో తాను వినలేదని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము త్వరలో సోనియా గాంధీకి విన్నవిస్తామని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సిపియం మినహా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలుగుదేశంలో కూడా తెలంగాణకు అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications