నష్టం లేదు: చిరు పార్టీపై మొయిలీ
హైదరాబాద్: కొత్త పార్టీల వల్ల తమ పార్టీకి నష్టం లేదని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెడతారనే వార్తలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ మాటలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో గ్రామీణ స్థాయి నుంచి అధ్యయనం చేస్తామని ఆయన అన్నారు. యూత్ కాంగ్రెస్ శిక్షణాశిబిరం ప్రారంభ కార్యక్రమంలో ఆయన బుధవారంనాడు ప్రసంగించారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు అందరి పనితీరును సమీక్షిస్తామని ఆయన చెప్పారు.
అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించబోమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను చూపించడానికి వనభోజనం లాంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications