ఎస్సార్సీ వేస్తే కాంగ్రెస్ బుగ్గిపాలు: కాకా
కరీంనగర్: తెలంగాణపై ఇప్పుడు రెండో ఎస్సార్సీ వేస్తే పార్టీ బుగ్గిపాలు అవుతుందని కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తాము ఇటీవల తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి సూచించినట్లు ఆయన తెలిపారు. రెండో ఎస్సార్సీ వేయాలని తానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో గతంలో తాను సూచించానని, అయితే అందుకు చాలా ఆలస్యమైందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఇప్పుడు ఎస్సార్సీ వేస్తే ప్రజలు తిరస్కరిస్తారని, ఇది ఎస్సార్సీ వేసే సమయం కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖ రెడ్డిని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి సిడబ్ల్యుసి సమావేశంలో తెలంగాణపై అటో ఇటో తేల్చేస్తామని ఆయన అన్నారు. ఎస్సార్సీతో సంబంధం లేకుండా తెలంగాణ ఇస్తారో లేదో పార్టీ అధిష్ఠానం తేల్చాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications