కుప్పం:పులివెందుల రాజకీయాలు కుప్పంలో చెల్లవని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిపై ద్వజమెత్తారు. అలా చేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేదిలేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు శనివారం కుప్పం నియోజకవర్గంలో పర్యటన జరుపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు భూములు కబ్జాచేయడం తప్ప మరేమీ చేయడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రెండో ఎస్సార్సీ పై సరైన సమయంలో స్పందిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.