చేయి నరికి లొంగిపోయిన మహిళ
కడప: అనురాధ అనే మహిళ తనను వేధిస్తున్న వ్యక్తి చేయి నరికిన సంఘటన కడపలో జరిగింది. అనంతరం ఆమె తన భర్తతో కలిసి కడప రూరల్ పోలీసు స్టేషనులో లొంగిపోయింది. ఈ సంఘటన ఆదివారం జరిగింది. ఆటో డ్రైవరుగా పనిచేస్తున్న శంకర్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు.
ఇదివరలో శంకర్ ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతను వదలకుండా అనురాధను వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేక ఆమె శంకర్ చేయి నరికింది.












Click it and Unblock the Notifications