శబరిమలైలో మురళీమోహన్ శిబిరం
శబరిమలై: మకర సంక్రాంతి సందర్భంగా తెలుగు సినీ నటుడు మురళీమోహన్ శబరిమలై కొండపై అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద యెత్తున తరలి వచ్చిన భక్తుల కోసం స్వామి అయ్యప్ప సన్నిదానంలో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మకరజ్యోతిని సందర్శించేందుకు పెద్ద యెత్తున భక్తులు తరలివచ్చారు. కొండపై దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు ఉంటారని అంచనా. వీరిలో రెండున్నర లక్షల మంది తెలుగువారే. స్వామి దర్శనానికి దాదాపు 12 గంటలు పడుతోంది.
మకరజ్యోతిని సందర్శించడానికి పది లక్షల మందికిపైగా వివిధ చోట్ల నిరీక్షిస్తున్నారు. అయ్యప్ప దేవాలయాన్ని సోమవారం మధ్యాహ్నం మూసివేశారు. మకరజ్యోతి సోమవారం సాయంత్రం దర్శనమిస్తుంది. మకరజ్యోతి దర్శనం అనంతరం ఆలయం తలుపులు తెరిచి సందర్శనకు అనుమతిస్తారు. వసతులు సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి కోసం భక్తులు కటకటలాడుతున్నారు. తీవ్రవాదులు భయంతో పెద్ద యెత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ నటులు కూడా శబరిమలై చేరుకున్నారు.












Click it and Unblock the Notifications