ఎమ్మెస్సార్, కాకాలపై జీవన్ గరం
హైదరాబాద్: తెలంగాణపై సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎం. సత్యనారాయణరావు, జి. వెంకటస్వామి చేస్తున్న ప్రకటనలపై తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి టి. జీవన్ రెడ్డి మండిపడ్డారు. సీనియర్ నాయకులు తెలంగాణపై ప్రకటనలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని ఆయన పరోక్షంగా సమర్థించారు.
సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేస్తున్న పార్టీ నేతలతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి తెలంగాణలోని సీనియర్ నేతలకు అవకాశం ఉన్నా బహిరంగ ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. సీనియర్ నేతల ప్రకటనల వల్ల తెలంగాణలో పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications