నేను సోనియాను విమర్శించలేదు: కెసిఆర్
హైదరాబాద్: తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించలేదని, కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. తాము 2004లో రెండో ఎస్సార్సీని అంగీకరించలేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండో ఎస్సార్సీ వేసిన వెంటనే తమ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేస్తారని ఆయన చెప్పారు.
రెండో ఎస్సార్సీని అంగీకరిస్తున్నవారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications