పట్టపగలు మహిళ దారుణ హత్య
విజయవాడ: విజయవాడలో పట్టపగలు ఒక వివాహిత దారుణ హత్య సంచలనం సృష్టించింది. విజయవాడలోని బృందావన్ కాలనలో గల మారుతీ టవర్స్ లో కవితా జైన్ అనే 40 యేళ్ల కవితా జైన్ అనే మహిళ సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఈ దారుణ హత్య జరిగింది. మెడకు టవల్ బిగించి కవితా జైన్ ను హత్య చేశారు. ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
దినేష్ కుమార్, కవితల కుటుంబం మారుతీ టవర్స్ లోని నాలుగో అంతస్థు ఫ్లాటులో ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. దినేష్ కుమార్ ఉత్తరప్రదేశ్ కు వెళ్లినట్లు సమాచారం. ముగ్గురు పిల్లలు కూడా గుంటూరులోని ఒక దేవాలయానికి వెళ్లారు. ఇంట్లో కవిత ఒక్కరే ఉన్నారు. దీన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కవితను హత్య చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ ను తెప్పించారు.












Click it and Unblock the Notifications