సీనియర్ల వల్లే తెరాస రెచ్చిపోతోంది: ముఖేష్


మెదక్: తమ పార్టీకి చెందిన కొందరు సీనియర్ల ప్రకటనల వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు రెచ్చిపోతున్నారని రాష్ట్ర మంత్రి ముఖేష్ విమర్శించారు. ఒక కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు ముఖేష్, దామోదరం రాజనర్సింహలను తెరాస కార్యకర్తలు ఆదివారంనాడు ఘెరావ్ చేశారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలనే కాంగ్రెస్ ప్రయత్నాన్ని నిరసిస్తూ వారు మంత్రులను ఘెరావ్ చేశారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉందని, ఏమిటిలో ఏమీ జరగులేదని ముఖేష్ అన్నారు.

అధిష్ఠానవర్గంలో పదవుల్లో ఉంటూనే తమ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణపై అనవసర ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీకి నిరసనగా తాను రాజీనామా చేస్తానని చేసిన ప్రకటనను తమ పార్టీ సీనియర్ నేత జి. వెంకటస్వామి విజ్ఞతకే వదిలేస్తున్నామని రాజనర్సింహం అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంటుందని, ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+