ఎన్నికల్లో పోటీ చేయను: ఎమ్మెస్సార్
నల్లగొండ: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు, ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణరావు చెప్పారు. తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. తన 75వ జన్మదినం సందర్భంగా ఆయన సోమవారంనాడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆర్టీసిని ప్రైవేట్ పరం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై గత కొంతకాలంగా ఆయన కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలనే ఆలోచనను వెంకటస్వామితో కలిసి ఆయన వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications