దేవేందర్ తెలంగాణవాణిపై మండిపాటు
హైదరాబాద్: తెలంగాణపై పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ చేసిన ప్రకటనపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణపై పార్టీ కచ్చితమైన విధానానికి కట్టుబడి ఉందని, సమైక్యాంధ్రకే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ప్రజల మనోగతానికి వ్యతిరేకంగా పార్టీ నడుచుకోలేదని, తెలంగాణపై మహానాడులోగానే పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని దేవేందర్ గౌడ్ అన్నారు.
ఎస్సార్సీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తెలంగాణపై కొంతమంది నాయకులు ప్రకటనలు చేస్తున్నారని, వ్యక్తిగత ఎజెండాలు ఉండకూడదని ఆయన అన్నారు. అలా మాట్లాడేవారు పార్టీ బయటకు వెళ్లిపోయి మాట్లాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశంపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications