తెలంగాణ ఇవ్వాల్సిందే: చెన్నమనేని
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చెన్నమనేని రాజేశ్వర రావు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తమ పార్టీ త్వరలో ఒక వైఖరి తీసుకుంటుందని ఆయన చెప్పారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ దగా చేస్తోందని, ఎప్పటికప్పుడు తప్పులు చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా తమ నేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని, ఆ రాజనీతిజ్ఞత చంద్రబాబుకు ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications