హైదరాబాదులో మహిళ సజీవదహనం
హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒక మహిళ అందరూ చూస్తుండగా సజీవదహనమైంది. హైదరాబాదులోని ముషీరాబాదు నర్మదా ఆస్పత్రి సమీపంలో జరిగింది. ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మానసిక స్థితి సరిగా లేకనే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులంటున్నారు. ఆమె పేరు మీనాక్షి. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు.
సోమవారం ఉదయాన్ని లేచిన మీనాక్షి ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు వేసింది. ఆ సమయంలో భర్త ఆటో తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ డబ్బా తీసుకుని వచ్చి ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుని ఉంటుందని అంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications