రాజీనామాలపై ఆందోళన లేదు: పాల్వాయి
హైదరాబాద్: తెలంగాణపై మూకుమ్మడి రాజీనామాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీసుకున్న నిర్ణయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. రాజీనామాల వల్ల జరిగే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, చేసేవాళ్లు పోటీ చేస్తారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తాము పోటీ చేయకపోతే జరిగే ఎన్నికలకు విలువ ఉండదని, కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో తాము పోటీ చేయడం వల్లనే తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విజయానికి విలువ చేకూరిందని, అటువంటి అవకాశం తాము తెరాసకు ఇవ్వబోమని ఆయన అన్నారు. సెంటిమెంటును అసరాగా తీసుకుని తెరాస బలం పెంచుకోవాలని అనుకుంటోందని, అటువంటి అవకాశం తాము తెరాసకు ఇవ్వమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
