కాంగ్రెస్ వైఖరేమిటి: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణపై మార్చి మొదటివారంలోగా కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించకపోతే తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని గత మూడున్నరేళ్ల దాని వ్యవహార శైలి తెలియజేస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పడం అబద్ధమని ఆయన అన్నారు. సిపిఐ కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఆనయ అన్నారు. కరీంనగర్ లోకసభ ఫలితం తర్వాత కూడా గుణపాఠం నేర్చుకోకుండా తెలంగాణకు ద్రోహం చేయడానికే సిద్ధపడుతోందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీ తోక ముడిచి కెసిఆర్ చెప్పిందే నిజమని, తాము యుపిఎ ఉమ్మడి కార్యాచరణలో తెలంగాణ అంశానికి కట్టుబడి ఉన్నామని చెప్పారని ఆయన అన్నారు. తమను రాష్ట్ర, కేంద్ర మంత్రివర్గాల్లో చేర్చుకుని మిత్రద్రోహానికి పాల్పడుతూ తమ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేశారని, ఆ విధంగా తెలంగాణ ఆకాంక్ష లేదని చెబుతూ వచ్చారని ఆయన అన్నారు. తెలంగాణపై అసలు కాంగ్రెస్ వైఖరి ఏమిటని ఆయన అడిగారు. కాంగ్రెస్ వైఖరి వెల్లడించకపోవడంలోని మాయ, మర్మం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పూటకో మాట, నాయకుడికో మాట మాట్లాడుతారని, కాంగ్రెసుకు నిర్దిష్టమైన వైఖరి ఉందా, లేదా, తెలంగాణ ఇస్తారా, ఇవ్వరా అని ఆయన అన్నారు. వారంలోగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదికను కోరాలని, వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అధికారికంగా ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయన అన్నారు. ఇవ్వాలనుకున్నా ఆలస్యం జరిగితే కాంగ్రెసుకు ఆ అవకాశం ఉండదని, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఏమైనా చేయగలుగుతుందని ఆయన అన్నారు. తాము మార్చి 6వ తేదీ వరకు నిరీక్షిస్తామని, మార్చి 6వ తేదీన తమ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తారని, సభల్లోనే రాజీనామాలు చేస్తారని ఆయన చెప్పారు. ఆ తర్వాత గ్రామగ్రామాల్లో తెలంగాణపై ప్రచారం మొదలు పెడతామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+