చంద్రబాబుకు కెసిఆర్ చురకలు

హైదరాబాద్: తెలంగాణ అంశం కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలకు మాత్రమే సంబంధించిందని తమకు సంబంధించింది కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా తీర్పు చెప్పినా దాన్ని గౌరవించకుండా చంద్రబాబు అవమానపరిచే ప్రకటనలు చేస్తే సహించబోమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో హెచ్చరించారు. చంద్రబాబుకు ఉద్యమ స్వరూపం అర్థం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశం తమది కాదని చంద్రబాబు ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.

ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామని చెప్పుకుంటూ చంద్రబాబు పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరించే నాయకుడని ఆయన విమర్శించారు. తెలంగాణలోని వివిధ పార్టీల నాయకులు ఎవరేమిటో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయకపోతే మార్చి 6వ తేదీన రాజీనామాలు చేసి మండలాలకు బస్సు యాత్రలు చేపడుతామని ఆయన చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మూడింట రెండింతల మెజారిటీ ఖాయమని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+