సిఎం హెచ్చరికలు: వెనక్కి తగ్గని నేతలు

తెలంగాణ అంశంపై మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో వీరప్పమొయిలీతోనూ, పార్టీ అధినేత సోనియా గాంధీతోనూ సమావేశమయ్యారు. తెలంగాణపై సోనియాదే తుది నిర్ణయమని, తాము సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. తెలంగాణపై తాము యుపిఎ ఉమ్మడి ప్రణాళికకు కట్టుబడి ఉంటామని, రెండో ఎస్సార్సీతో తెలంగాణకు సంబంధం లేదని, తెలంగాణ అంశాన్ని విడిగానే పరిశీలిస్తామని వీరప్పమొయిలీ ప్రకటన చేసిన తర్వాత కూడా హైదరాబాదులో తెలంగాణ నాయకులు వెనక్కి తగ్గలేదు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తన వ్యూహాన్ని మార్చుకుంది. నిరసన సభ నిర్వహించాలనుకున్న తెరాస ఇప్పుడు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతోంది.












Click it and Unblock the Notifications
