రాజీనామాలతో లాభం ఉండదు: బిజెపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మూకుమ్మడి రాజీనామాల నిర్ణయం వల్ల ప్రయోజనం ఉండదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు సిహెచ్. విద్యాసాగరరావు అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని కాపాడడానికి అది పనికి వస్తుందని, అయితే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న శక్తులన్నింటినీ ఏకం చేయకుండా అటువంటి నిర్ణయాల వల్ల పెద్దగా ఫలితం ఉండదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణకోసం పోరాటం చేస్తున్న శక్తులన్నింటినీ ఏకం చేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తేవాల్సి వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేదే కాంగ్రెస్ నాయకత్వానికి పడుతుందని, మిగతా విషయాలు అంతగా పట్టవని ఆయన అన్నారు. తెరాస రాజీనామాల నిర్ణయాన్ని తాము హర్షిస్తున్నామని, అయితే రాజీనామాల వల్ల గతంలో లాభం జరగలేదని, భవిష్యత్తులో కూడా జరగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
