కెసిఆర్ ది తొందరపాటు: విహెచ్
న్యూఢిల్లీ: తెలంగాణపై మూకుమ్మడి రాజీనామాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయం తొందరపాటుతో కూడిందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణపై డెడ్ లైన్లు పెట్టడం సరి కాదని, తెలంగాణపై అన్ని పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేయాలని ఆయన కెసిఆర్ కు సూచించారు.
వి. హనుమంతరావు బుధవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కలుసుకున్నారు. తాను ముఖ్యమంత్రితో తన నియోజకవర్గంలోని అభివృద్ధి గురించే మాట్లాడానని ఆయన హనుమంతరావు చెప్పారు. తెలంగాణపై ఎవరూ మాట్లాడవద్దని తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పినందున తాను తెలంగాణపై మాట్లాడలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
