కెసిఆర్ నిర్ణయం తెలియదు: వైయస్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మూకుమ్మడి రాజీనామాల నిర్ణయంపై మాట్లడడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నిరాకరించారు. తెలంగాణపై మార్చి 6వ తేదీన మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన గురించి తనకు తెలియదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన సెంట్రల్ ఫోర్సు చార్జీలు 240 కోట్ల రూపాయల మేరకు పెండింగులో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని తాను చిదందరంతో చెప్పినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ గురించి, తదితర విషయాల గురించి తాను చిదంబరంతో మాట్లాడానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
