ఎలా నోరు మూసుకుంటాం: సర్వే
హైదరాబాద్: తెలంగాణపై నోరు విప్పవిద్దని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెచ్చరికలు గాలిలో కలుస్తున్నాయి. తెలంగాణపై ఎలా నోరు మూసుకుంటామని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ ప్రశ్నించారు. మిగతా పార్టీలను ఎవరు అదుపు చేస్తారని ఆయన అడిగారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణపై ఈ నెలాఖరున తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తామని, ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తామని ఆయన గురువారంనాడు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామా బెదిరింపులు ఆ పార్టీ వ్యవహారమని, అవసమైతే త్యాగాలు చేయడానికి తాము కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications