వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు మృతి
వరంగల్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ప్రార్థనామందిరానికి వెళ్లిన యువకులు అక్కడి వాటర్ ట్యాంకు పక్కన నిలబడ్డారు. ఈ సమయంలో వాటర్ ట్యాంకు గోడలు కూలి మీద పడ్డాయి.
ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి వరంగల్లులోని ఎంజిఎం అస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.












Click it and Unblock the Notifications