దేవేందర్ ఇక ఇంటి దారి: గొనె
కరీంనగర్: తెలుగుదేశం పార్టీ నుంచి తూళ్ల దేవేందర్ గౌడ్ ను పంపించడానికి రంగం సిద్ధమైందని కాంగ్రెస్ నాయకుడు గోనె ప్రకాశరావు అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే నైతిక హక్కు దేవేందర్ గౌడ్ కు లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దేవేందర్ గౌడ్ అక్రమాస్తులతో, వెన్నుపోట్లుతో చరిత్ర సృష్టించారని ఆయన వ్యాఖ్యానించారు.
దేవేందర్ గౌడ్ అక్రమ వ్యాపారాలతో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టి తన బంధువులవని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్ ను దేవేందర్ గౌడ్ తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు. దీనిపై గోనె ప్రకాశరావు తీవ్రంగా ప్రతిస్పందించారు. గోనె ప్రకాశరావు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పెంపుడు కుక్క అని టిఎన్ ఎస్ ఎఫ్, టివిఎస్ వ్యాఖ్యానించాయి. దేవేందర్ గౌడ్ పై విమర్శలు మానుకోకపోతే గోనె ప్రకాశరావును పిచ్చాసుపత్రిలో చేరుస్తామని ఆ సంస్థలు అన్నాయి.












Click it and Unblock the Notifications
