తెలంగాణ పాలపొంగు కాదు: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం పాలపొంగు కాదని, సముద్రం ఉప్పెన అని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుతడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం పాలపొంగు అని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యపై ఆయన శుక్రవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడకూడదని పురుషోత్తమ రెడ్డి లగడపాటి రాజగోపాల్ కు సలహా ఇచ్చారు.
తెలంగాణ ప్రజలకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్యాయం చేయరని, తెలంగాణ ఏర్పాటుకు సోనియా నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోమని సోనియా చెప్తే తామూ రాజీనామా చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గడువును తాము పట్టించుకోవడం లేదని, అది తెరాస అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తమ పద్ధతిలో తాము పోరాడుతున్నామని, పోరాడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
