వైయస్ దాచేస్తే పార్టీకి నష్టం: అమోస్


హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంటును దాచేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తే పార్టీకే నష్టమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అమోస్ అన్నారు. తెలంగాణపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించేందుకు ముఖ్యమంత్రి తమతో పాటు ఢిల్లీకి వస్తే సంతోషమని ఆయన అన్నారు. తెలంగాణపై భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎం. సత్యనారాయణరావు, నర్సారెడ్డి, అమోస్, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ శుక్రవారం సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్ల రాజ్యం వస్తుందని కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అనడం మంచిది కాదని పాల్వాయి గోవర్దన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ అన్నారు. తమలోనూ పాలనా సామర్థ్యం ఉందని, తెలివి తక్కువగా మాట్లాడవద్దని వారు రవీంద్రనాథ్ రెడ్డికి సలహా ఇచ్చారు. తెలంగాణపై రవీంద్రనాథ్ రెడ్డి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నోరు విప్పకుండా అదుపు చేయాలని వారు పార్టీ నాయకత్వాని్ని కోరారు. ఈ నెల 28వ తేదీన తాము సోనియాను కలుస్తామని సర్వే సత్యనారాయణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+