వైయస్ బావమరిది మాటలేల?: విహెచ్
న్యూఢిల్లీ: తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణపై ఎవరూ మాట్లాడకూడదని పార్టీ ఆదేశించిన తర్వాత రవీంద్రనాధ్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారంనాడు అడిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నక్సల్స్ రాజ్యమేలుతారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.
కడపలో నక్సలైట్లు లేరా అని హనుమంతరావు అడిగారు. తెలంగాణపై వ్యతిరేకతతో మావోయిస్టుల అంశాన్ని ముందుకు తేవడం మంచిది కాదని ఆయన సలహా ఇచ్చారు. అధిష్ఠానవర్గం మాట్లాడవద్దని చెప్పినందున తాను తెలంగాణపై మాట్లాడడం లేదని హనుమంతరావు గతంలో అన్నారు.












Click it and Unblock the Notifications
