తెలంగాణపై జోక్యం చేసుకోను: వైయస్
హైదరాబాద్: తెలంగాణ విషయంలో తాను జోక్యం చేసుకోనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై మాట్లాడుతున్నవారి సంగతి తమ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం చూసుకుంటుందని ఆయన అన్నారు. మైనారిటీల సంక్షేమం గురించి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నలకు ఆయన ఆ విధంగా సమాధానాలిచ్చారు.
విశాఖపట్నంలోని 5300 పైచిలుకు ఎకరాల భూమిని వక్ఫ్ అస్తులుగా ప్రకటిస్తున్నట్లు, దీంతో 105 ఏళ్ల వివాదానికి తెరపడిందని ముఖ్యమంత్రి చెప్పారు. మైనారిటీ కార్పోరేషనుకు చెందిన 23 కోట్ల రూపాయల వడ్డీని మాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మైనారిటీలకు ఈ ఏడాది 1.14 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రైస్తవ, సిక్కు మత ఆస్తుల రక్షణకు 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11వ తేదీని మైనారిటీ దినోత్సవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
