తెలంగాణ అలా రాదు: బర్దన్
చెన్నై: రెండో ఎస్సార్సీ వల్ల తెలంగాణ రాష్ట్రం రాదని సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వాయిదా వేసేందుకే కాంగ్రెస్ రెండో ఎస్సార్సీ మంత్రాన్ని జపిస్తోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తమ పార్టీకి కచ్చితమైన వైఖరి ఉందని, ప్రత్యేక తెలంగాణవాదాన్ని విస్మరించి అభివృద్ధి గురించి మాట్లాడినంత మాత్రాన ఫలితం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. వామపక్షాల మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు సిద్ధాంతపరమైనవి కావని ఆయన అన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు పోతున్న తరుణంలో సిద్ధాంతాలను పక్కన పెట్టుకున్నారనే వాదనలో నిజం లేదని ఆయన అన్నారు. పెట్రో ధరల పెంపు, సామాన్యుల కష్టాలు తమ దృష్టి నుంచి దాటిపోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications