రాష్ట్రాల విభజన కూడదు: కారత్
న్యూఢిల్లీ: తాము రాష్ట్రాల విభజనకు వ్యతిరేకమని, ఈ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ చెప్పారు. బిజెపియేతర, కాంగ్రెసేతర మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటుకు తాము సానుకూలమని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బిజెపి విధానాలకు తాము వ్యతిరేకమని, అందువల్ల ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వామపక్షాలపై, ముఖ్యంగా సిపిఎంపై ఉందని ఆయన అన్నారు. కోయంబత్తూర్ పార్టీ కాంగ్రెస్ కోసం రూపొందించిన రాజకీయ తీర్మానం ముసాయిదాను ఆయన ఆదివారం విడుదల చేశారు.
బిజెపిని ఒంటరి చేసి ఒడించే ఎత్తుగడలను తమ పార్టీ కొనసాగిస్తుందని, అదే సమయంలో కాంగ్రెస్ తో పొత్తును పెట్టుకోవడం గానీ ఐక్య కూటమి కట్టడం గానీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. బిజెపి, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఉన్న ఆర్థిక విధానాల దృష్ట్యా రాజకీయ పార్టీలు తమతో ఆవగాహనకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తృతీయ ప్రత్యామ్నాయం కేవలం ఎన్నికల పొత్తుకు మాత్రమే పరిమితం కాకూడదని, అయితే తమ పార్టీ అవసరమైన చోట ఎన్నికల సర్దుబాటుకు పూనుకుంటుందని సిపియం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి చెప్పారు.












Click it and Unblock the Notifications