టిడిపిని వదలను: దేవేందర్

హైదరాబాద్: తాను పార్టీని వీడేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ముఖేష్ చేసిన వ్యాఖ్యపై ఆయన సోమవారం తీవ్రంగా ధ్వజమెత్తారు. పొన్నాల లక్ష్మయ్య, ముఖేష్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పులివెందుల మార్కు రాజకీయాలు ఇక్కడ సాగవని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications