ఏనుగుల దాడిలో ఒకరి మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చలివేంద్రం గ్రామంలో ఏనుగులు మరో వ్యక్తిని బలి తీసుకున్నాయి. రాత్రి పూట పంట కాపలాకని బయలుదేరిన సాంబయ్య అనే వ్యక్తిని ఏనుగులు దూసుకొచ్చి తొక్కి చంపాయి. దీంతో ఏనుగుల దాడిలో మరణించినవారి సంఖ్య 11కు చేరుకుంది.
సాంబయ్యకు ఏడుగురు సంతానం. సాంబయ్య మృతితో ఆ కుటుంబం దిక్కు లేకుండా పోయింది. ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నా అటవీ శాఖ అధికారులు తమ రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. బయటకు వెళ్లాలంటే భయం కలుగుతోందని వారంటున్నారు. ఇప్పటి వరకు ఏనుగుల బెడదను తొలగించడానికి 36 లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారంటున్నారు. మృతుడి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications