ఇద్దరు బాలికల ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోనరావుపేటలో ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన మౌనిక, సుమలత అనే బాలికలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సంక్రాంతి పర్వదినం రోజు జరిగింది. అయితే శవాలను సోమవారంనాడు కనుక్కున్నారు. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మౌనిక, సుమలతలు బావిలో శవాలై తేలడం వారి కుటుంబాన్ని మనస్తాపానికి గురి చేసింది. ప్రవర్తన సరిగా లేదంటూ వారిని తల్లిదండ్రులు దండించారు. దీంతో బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన వారు శవాలై బావిలో తేలారు.












Click it and Unblock the Notifications