నెల్లూరులో విద్యార్థిని కిడ్నాప్
నెల్లూరు: నెల్లూరులో విద్యాభారతి అనే పాఠశాలకు చెందిన విద్యార్థిని తులసి అపహరణకు గురైంది. తులసి విద్యాభారతి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన తులసి కిడ్నాప్ నకు గురైంది. దీనిపై ఆమె తల్లిదండ్రులు నెల్లూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తులసి కిడ్నాప్ ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంధువులే తులసిని తీసుకొని వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రేమ వ్యవహారం నడస్తుండడంతో పెళ్లి చేస్తామంటూ తులసిని తీసుకొని వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications