3 నెలలకే కన్వీనర్ పరారీ: మధుయాష్కీ
హైదరాబాద్: మనుగడ కోసమే యుఎన్ పిఎ నాయకులు చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ విమర్శించారు. యుఎన్ పిఎ ఏర్పాటైన మూడు నెలలకే కన్వీనర్ జయలలిత పారిపోయారని, యుఎన్ పిఎ పని చేసే కూటమి కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. యుఎన్ పిఎ నాయకులకు ఆర్థిక విధానాలపై గానీ శాంతిభద్రతలపై అవగాహన లేదని ఆయన అన్నారు.
చిన్న రాష్ట్రాల్లో నక్సల్స్ సమస్య పెరుగుతుందనే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటనలో నిజం లేదని, వారికి శాంతిభద్రతల విషయంలో అవగాహన లేదని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల వల్ల నక్సలైట్ సమస్య పెరుగుతుందనే వాదనను కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన బిజెపి నేత ఎల్.కె. అద్వానీ వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications