దేవేందర్ రేపో మాపో గుడ్ బై: మంత్రులు
హైదరాబాద్: దేవేందర్ గౌడ్ రేపో మాపో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ముఖేష్ జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో ఉందని వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
అంతర్గత సంక్షోభం నుంచి బయట పడడానికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బిసి గర్జన పేరిట కొత్త డ్రామా ఆడుతున్నారని వారు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వారన్నారు.












Click it and Unblock the Notifications