తెలంగాణలో నన్నాపలేరు: లగడపాటి
న్యూఢిల్లీ: తెలంగాణలో తిరగకుండా తనను ఎవరూ ఆపలేరని విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దూషణలు తనకు ఆశీర్వాదాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రం విడిపోతే తన ల్యాంకో కంపెనీకి నష్టమేమీ లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయ సాధన వల్ల తెలంగాణ రాష్ట్రం రాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తనకు మాటకు మాట చెప్పే అలవాటు లేదని, తాను చేతల మనిషినని ఆయన అన్నారు. రాష్ట్రాల విభజన అశాస్త్రీయంగా చేసుకుంటూ పోతే అడ్డగోలు డిమాండ్లు వస్తాయని ఆయన అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు పెంచవద్దని మాత్రమే తాను అంటున్నానని ఆయన చెప్పారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తాము మంచిని పంచుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications